Politics27th Oct 04:24 PMSunil Byrisetty1 min read
మా వాళ్లపై చెయ్యి వేస్తే.. నాపై వేసినట్టే
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటించారు. అక్కడ ప్రజలను కలిసిన ఆయన మా వాళ్లపై చెయ్యి వేస్తే.. నాపై వేసినట్టేనని హెచ్చరించారు. అన్యాయం చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మ
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటించారు. అక్కడ ప్రజలను కలిసిన ఆయన మా వాళ్లపై చెయ్యి వేస్తే.. నాపై వేసినట్టేనని హెచ్చరించారు. అన్యాయం చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మా టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని తేల్చి చెప్పారు. రిటైర్ అయిన అధికారిని కూడా ఎక్కడున్నా తీసుకొస్తామని వార్నింగ్ ఇచ్చారు. రక్షకులుగా ఉండాల్సినవారే దౌర్జన్యం చేస్తే కాపాడేదెవరని ప్రశ్నించారు.
అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా భయపడేది లేదని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.