News12th Apr 03:27 PMSunil Byrisetty1 min read
తిరుమల గోశాలలో గోవుల మృతి.. వాస్తవాలేంటి?
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని శ్రీవారి గోశాలలో గత 3 నెలల్లో 100కి పైగా గోవులు మృతిచెందాయని, ఈ విషయాన్ని దాచిపెట్టారని ఆరోపించారు. అత్
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని శ్రీవారి గోశాలలో గత 3 నెలల్లో 100కి పైగా గోవులు మృతిచెందాయని, ఈ విషయాన్ని దాచిపెట్టారని ఆరోపించారు.
అత్యంత పవిత్రంగా కొనసాగుతున్న టీటీడీ గోశాలలో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా తయారయిందని మండిపడ్డారు.
ఇప్పుడు ఆ గోవులకు పుట్టిన దూడలు, ఇతర ఆవుల పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు.
తిరుమల పవిత్రతను కాపాడతామని, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు ఏమయ్యారు? అని భూమన నిలదీశారు.
దీనిపై టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో ఈ ప్రచారం అంతా అవాస్తవమని స్పష్టం చేసింది.
టీటీడీ గోశాలలో గోవులు మృతిచెందాయని, బయటకు తెలియకుండా దాచిపెట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ అధికారులు ఖండించారు.
కొంతమంది సోషల్ మీడియాలో కావాలనే వదంతులు సృష్టిస్తున్నారని టీటీడీ ప్రకటించింది.
మృతిచెందిన ఆవుల ఫొటోలు టీటీడీ గోశాలకు చెందినవి కావని స్పష్టం చేసింది.
కొందరు కావాలనే వేరే ఎక్కడో చనిపోయిన గోవుల ఫొటోలను టీటీడీ గోశాలకు చెందిన గోవులంటూ ప్రచారం చేస్తున్నారని టీటీడీ తెలిపింది.