Politics7th Jul 02:42 PMSunil Byrisetty1 min read
లోకేష్ సమక్షంలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు
మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటనలో మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీఆర్ హైస్కూల్ పేరు మార్చడంపై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు. VR స్కూల్ అభివృ
మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటనలో మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీఆర్ హైస్కూల్ పేరు మార్చడంపై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు. VR స్కూల్ అభివృద్ధికి మున్సిపల్ మంత్రి సహకరిస్తే.. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా అవుతుందని అడిగారు. VR విద్యాసంస్థలు ఆనం కుటుంబం పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తనపై కక్షతో.. మేనేజింగ్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని తెలిపారు. VR హైస్కూల్‌లో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసేయాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్లను మంత్రి నారాయణ దత్తత తీసుకోవాలని అన్నారు.