News6th Nov 02:11 PMSunil Byrisetty1 min read
ఆ బాలిక ధైర్య సాహసాలకు అండ
రాప్తాడులో ఉన్మాది దాడి ఘటనలో ధైర్యాన్ని చూపిన బాలికపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో ఆమె కూడా గాయపడగా.. ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా సంస్థల అధిన
రాప్తాడులో ఉన్మాది దాడి ఘటనలో ధైర్యాన్ని చూపిన బాలికపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో ఆమె కూడా గాయపడగా.. ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆ బాలిక చూపిన ధైర్య సాహసాలు గొప్పవని, ఆమె చదువుకు సాయం చేస్తానని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. 'బాలిక కుటుంబం పేదరికంతో ఇబ్బందిపడుతోంది. ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంది. సాయం చేయండి' అని ఓ నెటిజన్ కోరగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. తన ప్రాణానికి ముప్పు ఉన్నా స్నేహితురాలిని కాపాడేందుకు ఆమె ప్రయత్నించిందన్నారు.