News14th Jun 12:59 PMSunil Byrisetty1 min read
'అనంత'లో దివ్యాంగుల యోగా గ్రాండ్ సక్సెస్
అనంతపురం నగరంలో దివ్యాంగులతో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. యోగాంధ్రలో భాగంగా అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం దివ్యాంగులత
అనంతపురం నగరంలో దివ్యాంగులతో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. యోగాంధ్రలో భాగంగా అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం దివ్యాంగులతో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జడ్పి చైర్ పర్సన్, జాయింట్ కలెక్టర్, తదితరులచేత యోగ మాస్టర్ ట్రైనర్స్ యోగాసనాలు వేయించారు. దివ్యాంగులు, పింఛన్ దారులు, వృద్ధులు ఏ విధంగా యోగా చేయాలన్నది యోగా మాస్టర్ ట్రైనర్లు ఆసనాలు వేసి చూపించారు. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జడ్పి చైర్ పర్సన్, జాయింట్ కలెక్టర్ కూడా ఆసనాలు వేసి దివ్యాంగులను ఉత్తేజపరిచారు. దివ్యాంగులు, పింఛన్ దారులు మొత్తం 2300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.