Politics11th Jun 04:14 PMSunil Byrisetty1 min read
మనమంతా కాంగ్రెస్ కుటుంబం
మనమంతా కాంగ్రెస్ కుటుంబమని, అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అనంతపురం జిల్లా నేతలతో సమావేశమైన ఆమె రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నది కేవలం
మనమంతా కాంగ్రెస్ కుటుంబమని, అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అనంతపురం జిల్లా నేతలతో సమావేశమైన ఆమె రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నది కేవలం కాంగ్రెస్ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలు అన్ని బీజేపీ తొత్తులేనని, కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీలు అంత మోసమేనని, బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఫీజు రీయింబర్స్ అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని అటకెక్కించారని, రైతులకు సుఖీభవ కింద 20 వేలు అని మోసం చేశారని విమర్శించారు. ప్రతి మహిళలకు నెలకు 15 వందలు..ఏడాదికి 18 వేలు అని ఇవ్వలేదని, ఉచిత బస్సు పథకం తుస్సుమన్నదని, నిరుద్యోగ భృతి, స్కూల్ కి వెళ్ళే ప్రతి బిడ్డకు ఏడాదికి 15 వేలు అని ఇవ్వలేదని మండిపడ్డారు. కరెంటు బిల్లులు మాత్రం భారీగా వసూళ్లు చేస్తున్నారని షర్మిల విమర్శించారు.