News7th Aug 03:22 PMSunil Byrisetty1 min read

అనంతపురం అభివృద్ధికి కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ వినతులు

అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యాల మెరుగుదల, రోడ్డు భద్రత, పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్

అనంతపురం అభివృద్ధికి కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ వినతులు
అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యాల మెరుగుదల, రోడ్డు భద్రత, పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి 3 కీలక వినతిపత్రాలను సమర్పించారు. అనంతపురం జిల్లా భవిష్యత్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎంపీ కోరారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య ఉన్న NH-44 దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారులలో ఒకటని ఎంపీ పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న ఈ మార్గం సామర్థ్యానికి మించి వాహన రాకపోకలు సాగుతున్నందున తరచూ ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. గుత్తి - గుంతకల్లు జాతీయ రహదారి టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించమని గడ్కరీని ఎంపీ కోరారు.
Andhra Pradesh
Anantapur
Ambica Lakshminarayana Valmiki
Nitin Gadkari
NH-44
National Highway
హైదరాబాద్-బెంగళూరు హైవే
గుత్తి
గుంతకల్లు
రోడ్డు మౌలిక వసతులు
రోడ్డు భద్రత
Scroll for the next article