Politics5th Mar 12:34 PMSunil Byrisetty1 min read

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు

నటుడు, జనసేన నేత నాగబాబు పదవిపై ఆ పార్టీ స్పష్టతనిచ్చింది. రాజ్యసభ, నామినేటెడ్ పదవి, ఎమ్మెల్సీ అన్న ప్రచారానికి తెరవేస్తూ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. శాసన సభ్యుల కోటాలో నిర్వహ

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
నటుడు, జనసేన నేత నాగబాబు పదవిపై ఆ పార్టీ స్పష్టతనిచ్చింది. రాజ్యసభ, నామినేటెడ్ పదవి, ఎమ్మెల్సీ అన్న ప్రచారానికి తెరవేస్తూ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
Nagababu
MLC
Janasena
Pawan Kalyan
Andhra Pradesh
నాగబాబు
ఎమ్మెల్సీ జనసేన
పవన్ కళ్యాణ్
ఆంధ్ర ప్రదేశ్
Scroll for the next article