Entertainment27th Dec 12:33 PMSunil Byrisetty1 min read
అనసూయ ఆగ్రహం.. సోషల్ మీడియాలో పోస్టులు
నటుడు శివాజీ వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం, శివాజీ వర్సెస్ అనసూయగా మారింది. దీనిపై మరోసారి స్పందించిన అనసూయ వరుసగా సోషల్‌మీడియా పోస్టులు పెట్టారు. ‘‘ఈ విషయం మీద నేను మరోసారి స్పష్టంగా
నటుడు శివాజీ వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం, శివాజీ వర్సెస్ అనసూయగా మారింది. దీనిపై మరోసారి స్పందించిన అనసూయ వరుసగా సోషల్‌మీడియా పోస్టులు పెట్టారు. ‘‘ఈ విషయం మీద నేను మరోసారి స్పష్టంగా మాట్లాడాలనిపించింది’’ అంటూ మొదలుపెట్టిన అనసూయ, తన మాటలను కావాలనే తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఆమె 'టెక్స్ట్‌బుక్ గ్యాస్‌లైటింగ్'గా వ్యాఖ్యానించారు. ‘‘నేను ఎవరినీ నాలాంటి దుస్తులు వేసుకోవాలని చెప్పలేదు. నా వ్యక్తిగత ఎంపికలను ఎవరి మీదా రుద్దలేదు. కానీ, ప్రతి మహిళకు తాను నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉండాలి అనే మాటకు మాత్రం నేను కట్టుబడి ఉంటాను’’ అని అనసూయ స్పష్టం చేశారు. తన దుస్తుల ఎంపికను కారణంగా చూపించి తన భర్తను, పిల్లలను విమర్శించడం దిగజారుడేనని అనసూయ మండిపడ్డారు. ‘‘ఇది కేవలం బట్టల గురించి కాదు. స్వతంత్రంగా ఆలోచించే మహిళలను చూసి భయపడే పితృస్వామ్య భావజాలం నుంచే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను ఇష్టపడకపోయినా, నేను చేసే ప్రతి పనిని గమనిస్తున్నారంటే… మీరు కూడా నా అభిమానుల కిందే లెక్క’’ అని అనసూయ వ్యాఖ్యానించారు.