Entertainment2nd Aug 12:47 PMSunil Byrisetty1 min read
‘చెప్పు తెగుద్దంటూ’.. అనసూయ సీరియస్ వార్నింగ్!
సినీ నటి, యాంకర్ అనసూయకు బాగా కోపం వచ్చింది. చెప్పు తెగుద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనసూయ గట్టిగా
సినీ నటి, యాంకర్ అనసూయకు బాగా కోపం వచ్చింది. చెప్పు తెగుద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనసూయ గట్టిగానే రెస్పాండ్ అయ్యారు. అక్కడ తనపై కొందరు అసభ్య కామెంట్లు చేయడం వినబడటంతోనే 'చెప్పు తెగుద్ది' అంటూ హెచ్చరించారు. ప్రారం అనసూయ మాట్లాడుతున్న సమయంలో కొందరు ఆకతాయిలు కామెంట్లు చేశారు. దీంతో అనసూయ 'చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య కుటుంబ సభ్యులను ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా. పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పలేదా? వెరీ బ్యాడ్' అంటూ అనసూయ సీరియస్ కామెంట్లు చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.