Politics26th Sep 05:48 PMSunil Byrisetty1 min read
పవన్ పై యాంకర్ శ్యామల వివాదాస్పద వ్యాఖ్యలు
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొన్ని ఘాటు పదాలను ఉపయోగిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కొన్ని ఘాటు పదాలను ఉపయోగిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 'యూరియా, డయేరియా, కలరా.. ఏది ఏమైనా పరవాలేదు రా.. మనల్ని ఆపేది ఎవడురా.. వెయ్యి రూపాయలు పెట్టి టికెట్టును కొనరా!' అని ఆమె ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా 'PPP గారూ??' అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో పాటు 'ఫెయిల్డ్ కూటమి' అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, శ్యామల చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.