News23rd Nov 10:37 AMSunil Byrisetty1 min read

తప్పు చేశా.. క్షమించండన్న యాంకర్ శివజ్యోతి

యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుపతి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆమె మాటలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ వెల్లువెత్తడంతో, శివజ్యోతి ఓ వీడియో విడుదల

తప్పు చేశా.. క్షమించండన్న యాంకర్ శివజ్యోతి
యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుపతి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆమె మాటలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ వెల్లువెత్తడంతో, శివజ్యోతి ఓ వీడియో విడుదల చేసి బేషరతుగా క్షమాపణలు తెలిపారు. తన తప్పును అంగీకరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. "తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందిని బాధించాయి. వివరణ ఇచ్చే ముందు హర్ట్ అయిన ప్రతి ఒక్కరికీ సారీ చెబుతున్నాను," అని ఆమె పేర్కొన్నారు. తాము రూ.10,000 ఖరీదైన ఎల్1 క్యూ లైన్‌లో వెళ్లామని, ఆ ఉద్దేశంతోనే ఖరీదైన లైన్ అని అన్నానని, అంతేకానీ ‘మేము ధనవంతులం’ అనే అహంకారంతో కాదని ఆమె స్పష్టతనిచ్చారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి అని, నాలుగు నెలలుగా శనివారం వ్రతాలు కూడా చేస్తున్నానని తెలిపారు. "నాకు అత్యంత విలువైన నా బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామే ఇచ్చాడు. అలాంటిది ఆయన గురించి నేనెలా తప్పుగా మాట్లాడతాను?" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. "నా ఉద్దేశం అది కాకపోయినా, నా మాటలు తప్పుగా ఉన్న మాట వాస్తవం. యూట్యూబ్ ఛానెళ్లు, కేసుల భయంతో కాకుండా, అలా మాట్లాడి ఉండకూడదని నాకే అనిపించింది. అందుకే క్షమాపణ కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు పునరావృతం కాదు," అని శివజ్యోతి స్పష్టం చేశారు.
Andhra Pradesh
Shivajyothi apology
Tirupati prasadam controversy
Telugu anchor news
viral controversy
social media backlash
Shivajyothi video apologyటిటిడి వివాదం
యూట్యూబ్ ట్రోలింగ్
శ్రీ వెంకటేశ్వర స్వామి
Scroll for the next article