Crime22nd Mar 04:45 PMSunil Byrisetty1 min read
హైకోర్టుకు యాంకర్ శ్యామల
ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె
ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదయింది.
ఆంధ్ర 365’ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు శ్యామల ప్రమోషన్ చేశారు.
ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త బెట్టింగ్ యాప్ లు పుట్టుకొచ్చాయి.
ఆల్రెడీ ఉన్న యాప్‌లతోపాటు కొత్త బెట్టింగ్ యాప్‌ల టార్గెట్ సామాన్య, మధ్య తరగతి ప్రజలే.
బెట్టింగ్ యాప్‌ల వల్ల అప్పుల పాలై ఇటీవల కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన యాంకర్‌లు, బుల్లితెర నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు