Farmers2nd Aug 04:32 PMSunil Byrisetty1 min read

కేంద్రంతో కలిపి రూ. 3175 కోట్లిచ్చాం: సీఎం

అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 46,85,838 రైతులకు లబ్ధి చేకూరుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో నిధులు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ ఒక్కో రైతుకు రాష్ట్రం

కేంద్రంతో కలిపి రూ. 3175 కోట్లిచ్చాం: సీఎం
అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 46,85,838 రైతులకు లబ్ధి చేకూరుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో నిధులు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ ఒక్కో రైతుకు రాష్ట్రం 5 వేలు, కేంద్రం 2 వేలు ఇచ్చామన్నారు. రాష్ట్రం వాటా 2343 కోట్లు, కేంద్రం వాటా 832 కోట్లు కలిపి 3175 కోట్లు విడుదల చేశామన్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే సుఖీభవ పోర్టల్ లో చెక్ చేసుకోవాలని సూచించారు. 155251 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకునే సదుపాయం కల్పించామని తెలిపారు. వ్యవసాయాన్ని గాడిన పెట్టడానికి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని 15,242 గ్రామాల్లో నిర్వహించామన్నారు. గతేడాది లక్షా 17 వేల 880 ఎకరాలకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చామని చెప్పారు. దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించి, నంబర్ 1గా నిలబెట్టామని సీఎం చంద్రబాబు వివరించారు.
Andhra Pradesh
Annadata Sukhibhava scheme
Chandrababu Naidu
farmer welfare
agriculture
ఆంధ్రప్రదేశ్ రైతులు
ప్రత్యక్ష నగదు బదిలీ
Scroll for the next article