News10th Jul 09:24 AMSunil Byrisetty1 min read
మెగా పీటీఎంతో గిన్నిస్ రికార్డ్
ఇటీవల యోగాంధ్రతో గిన్ని్స్ రికార్డులు సాధించిన ఆంధ్రా ప్రభుత్వం మరో రికార్డు సాధనకు సిద్ధమైంది. ఒకే రోజు రెండు కోట్ల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశాన్ని (మెగా పీటీఎం-
ఇటీవల యోగాంధ్రతో గిన్ని్స్ రికార్డులు సాధించిన ఆంధ్రా ప్రభుత్వం మరో రికార్డు సాధనకు సిద్ధమైంది. ఒకే రోజు రెండు కోట్ల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశాన్ని (మెగా పీటీఎం-2.0) నిర్వహించి రికార్డు సృష్టించనుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు.. అందరినీ ఒక చోటకు తీసుకొస్తోంది. విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఆలోచనతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించనున్న కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు. 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు, దాతలు మెగా పీటీఎం-2.0 లో పాల్గొనున్నారు. మొత్తం 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిర్వహించే ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డు సాధించనుంది.