News18th Sep 12:07 PMSunil Byrisetty1 min read

విశాఖలో లక్ష చదరపు అడుగుల్లో 'ఆంధ్రా మండపం'

విశాఖపట్నంలో ఆంధ్రా మండపం నిర్మాణం కానుంది. ఢిల్లీలోని భారత్ మండపం తరహాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సుల నిర్వహణ కోసం విశాఖపట్నం కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ భూముల్లో 'ఆంధ్ర మండపం

విశాఖలో లక్ష చదరపు అడుగుల్లో 'ఆంధ్రా మండపం'
విశాఖపట్నంలో ఆంధ్రా మండపం నిర్మాణం కానుంది. ఢిల్లీలోని భారత్ మండపం తరహాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సుల నిర్వహణ కోసం విశాఖపట్నం కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ భూముల్లో 'ఆంధ్ర మండపం' ప్రాజెక్ట్‌కు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ కన్వెన్షన్ సెంటర్‌లో ఏకకాలంలో 5,000 మంది కూర్చునేలా విశాలమైన ఆడిటోరియాన్ని ప్రతిపాదించారు. భారీ గ్లోబల్ ఎక్స్‌పోలు, పారిశ్రామిక ప్రదర్శనల కోసం 1 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఎయిర్ కండిషన్డ్ ఎగ్జిబిషన్ హాల్‌ను రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు, విఐపీల విడిది కోసం 250కి పైగా లగ్జరీ రూమ్‌లతో కూడిన 4-స్టార్ ప్లస్ హోటల్‌ను ఈ కాంప్లెక్స్‌లోనే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. విశాఖ తీర ప్రాంతాన్ని ఐటీ, టూరిజం, బిజినెస్ కాన్ఫరెన్స్‌లకు ప్రధాన హబ్‌గా మార్చే వ్యూహంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయిగా నిలవనుంది.
Scroll for the next article