News22nd Apr 09:54 AMSunil Byrisetty1 min read

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల

ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ నుంచి వస్తున్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మానవత్వం చాటుకున్నారు. ఏలూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన చూసిన మంత్రి, రెండు బైకులు ఢీకొన్న

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల
ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ నుంచి వస్తున్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మానవత్వం చాటుకున్నారు. ఏలూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన చూసిన మంత్రి, రెండు బైకులు ఢీకొన్న ఘటనలో గాయపడిన ఇద్దరు యువకులను చూసి వెంటనే తన వాహనాన్ని ఆపి.... గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించిన మంత్రి అంబులెన్స్‌ ఏర్పాటు చేయించి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి ఫోన్ చేసి, గాయపడిన యువకులకు మెరుగైన వైద్యం అందించాలంటూ ఆదేశించారు.
Eluru District
nadeendla manohar
humanity
రోడ్డు ప్రమాదం ఘటన చూసిన మంత్రి
ప్రథమ చికిత్స అందించిన మంత్రి
యువకులకు మెరుగైన వైద్యం
Scroll for the next article