Agriculture24th Aug 03:43 PMSunil Byrisetty1 min read
ఎక్కడకెళ్లినా ఆంధ్రా పాప్ కార్న్, అరకు కాఫీ!
ముసునూరు వద్ద గార్మె పాప్ కార్నికా నాన్ జీఎంఓ హైబ్రీడ్ మెయిజ్ విత్తనాలు ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రైతులపై అభిమానంతో వారు పండిస్తున్న జన్యుమార్పిడి జరగ
ముసునూరు వద్ద గార్మె పాప్ కార్నికా నాన్ జీఎంఓ హైబ్రీడ్ మెయిజ్ విత్తనాలు ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రైతులపై అభిమానంతో వారు పండిస్తున్న జన్యుమార్పిడి జరగని మొక్క జొన్న విత్తనాలను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారని చెప్పారు. గార్మె పాప్ కార్న్ సంస్థ భారత నేలపైనే దేశీయంగా జన్యుమార్పిడి జరగని విత్తనాలను రైతులతో కలిసి ఉత్పత్తి చేస్తోందని వివరించారు. నూజివీడు నుంచే పాప్ కార్న్ మొక్క జొన్న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతుందని తెలిపారు. 17,500 మంది రైతులతో 40 వేల ఎకరాల్లో ఈ నాన్ జీఎం హైబ్రీడ్ మొక్క జొన్న ఉత్పత్తి చేస్తున్నారని వివరించారు. ముసునూరు వద్ద దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని, దేశవ్యాప్తంగా పాప్ కార్న్ ఉత్పత్తిలో 70 శాతం వాటాను కలిగి ఉన్న గార్మె సంస్థకు అభినందనలు తెలిపారు. ఆంధ్రా పాప్ కార్న్, అరకు కాఫీ తాగేలా రైల్వే స్టేషన్లలోనూ కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.