News18th Dec 03:55 PMSunil Byrisetty1 min read

2029 కల్లా అందరికీ అ..ఆ..లు

అ...అక్షర...ఆ...ఆంధ్రప్రదేశ్ పేరిట 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెల

2029 కల్లా అందరికీ అ..ఆ..లు
అ...అక్షర...ఆ...ఆంధ్రప్రదేశ్ పేరిట 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 72.6 శాతం అక్షరాస్యత ఉందని చెప్పారు. రాష్ట్రంలో 81 లక్షల మంది నిరక్షరాస్యులున్నారని వారందర్నీ వచ్చే మూడేళ్లలో అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది 25 లక్షల మందిని అక్షరాస్యలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జిల్లాలో కలెక్టర్లు అక్షరాస్యత కార్యక్రమం విజయవంతంగా నిర్వహేంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. స్వయం సహాయక సంఘాల్లో చదువుకున్నవాళ్లను గుర్తించి వారితో ఆయా ప్రాంతాల్లో అక్షరాస్యత కార్యక్రమం వాలంటీర్లుగా వినియోగించుకోవాలని సూచించారు.
Andhra Pradesh
Literacy Mission
Education
100% Literacy
Human Resource Development
Kona Sasidhar
జిల్లా కలెక్టర్లు
వయోజన విద్య
స్వయం సహాయక సంఘాలు
ప్రభుత్వ కార్యక్రమాలు
Scroll for the next article