News24th Oct 10:59 AMSunil Byrisetty1 min read
2047నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్!
ఆంధ్రప్రదేశ్ ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా మార్చడమే తమ లక్ష్యమని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్ర
ఆంధ్రప్రదేశ్ ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా మార్చడమే తమ లక్ష్యమని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని పేర్కొన్నారు. మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆస్ట్రేడ్ అంతర్జాతీయ విద్య, వాణిజ్య సేవా నైపుణ్యం, డిజిటల్ డెలివరీ విభాగాధిపతి ఎలోడీ జర్నెట్ అధ్యక్షత వహించగా, లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకుపోతోందని వివరించారు. గత 16నెలల్లోనే $117 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించామన్నారు. సుదీర్ఘమైన పాలనానుభవం, సమర్థవంతమైన దార్శనిక నాయకుడి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ఏరోస్పేస్ & డిఫెన్స్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, డీప్‌టెక్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, లాజిస్టిక్స్, పోర్టులు, ఫార్మా, బయోటెక్నాలజీ, టూరిజం వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో విశేష పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు.