News23rd Dec 04:28 PMSunil Byrisetty1 min read

ఒక్కో ఇటుక పేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెడుతున్నాం

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలబెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందని సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిప

ఒక్కో ఇటుక పేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెడుతున్నాం
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలబెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందని సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంగళవారం సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాల గురించి మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాబిన్నం చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే 32% అదనంగా అప్పులు చేసిందని స్వయంగా కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొందన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్‌కు వెలుపల, కార్పొరేషన్ల పేరుతో విచక్షణారహితంగా అప్పులు చేసిందని అన్నారు. అప్పు తెచ్చిన నిధులను మూలధన వ్యయం కోసం కాకుండా కేవలం ఇతర ఖర్చులకే వినియోగించారని తెలిపారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏ నాగరికత అభివృద్ధి అయినా రోడ్లపై కనిపిస్తుందని అంటారని, కానీ గత ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులను, కొత్త రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఒక్కో ఇటుక పేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెడుతున్నామని వివరించారు.
Andhra Pradesh Development
Coalition Government
Minister Kolusu Parthasarathi
Meet the Press
Vijayawada Press Club
Information and Public Relations Department
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
కాగ్ నివేదిక
అప్పులు
మౌలిక సదుపాయాలు
Scroll for the next article