Politics4th Sep 11:23 AMSunil Byrisetty1 min read
2026లోనే స్థానికం పూర్తి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్ంయలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. మొదట
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్ంయలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. మొదట మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత దశలవారీగా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన, సాంకేతిక అడ్డంకులను అధిగమించడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. పురపాలక సంఘాలకు సంబంధించిన పలు న్యాయపరమైన చిక్కులను ప్రభుత్వం విజయవంతంగా పరిష్కరించింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంంది. బీసీలకు కనీసం 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా చట్టబద్ధ చర్యలు చేపడుతోంది.