News17th Aug 01:54 PMSunil Byrisetty1 min read

రేపు మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత!

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్షప్రభావం తప్పేలా లేదు. బంగాళాఖాతంలో ఈ నెల 18, 23 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీ

రేపు మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత!
తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్షప్రభావం తప్పేలా లేదు. బంగాళాఖాతంలో ఈ నెల 18, 23 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. సోమవారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 18, 19 తేదీల్లో అత్యంత అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడు మరోసారి కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
Andhra Pradesh
Telangana
Heavy rain
Monsoon
Low-pressure systems
Cyclone alert
Weather forecast
IMD
Coastal Andhra
Flood risk
Rain warning
మరో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత
Scroll for the next article