News12th Sep 02:43 PMSunil Byrisetty1 min read
పౌల్ట్రీ రైతుల సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, పౌల్ట్రీ రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు
రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, పౌల్ట్రీ రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పాలసీకి ఆమోదం తెలిపిన సందర్భంగా పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాలసీని త్వరితగతిన అమల్లోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగానికి నూతన ఊతం అందించడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉత్పాదకతను పెంచడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పాలసీని రూపొందించినట్లు తెలిపారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.657 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని వివరించారు. ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రోత్సాహకాల కోసం రూ.209 కోట్లు, ఇండస్ట్రియల్ పాలసీ కింద రూ.152.18 కోట్లు, పశుసంవర్థక శాఖ ద్వారా అమలు చేయనున్న కార్యక్రమాలకు రూ.296 కోట్లు కేటాయించనున్నారు.