Politics10th Apr 12:35 PMSunil Byrisetty1 min read

కూటమి ప్రభుత్వంలో రైళ్ల పరుగులు

NDA కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చర్యలు వేగవంతం అవుతున్నాయని వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతి-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్‌ ప్రాజెక్టు ఆమోదంపై ప్రధాన

కూటమి ప్రభుత్వంలో రైళ్ల పరుగులు
NDA కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చర్యలు వేగవంతం అవుతున్నాయని వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతి-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్‌ ప్రాజెక్టు ఆమోదంపై ప్రధాని నరేంద్రమోదీకి, రైల్వేమంత్రి అశ్విన్ శ్రీ వైష్ణవ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట అనుసంధానంతో పాటు వెల్లూరు, తిరుపతి వంటి విద్య, వైద్య కేంద్రాలకు ప్రాజెక్టు ఎంతో మేలు చేకూర్చుతుంది. ఈ ప్రాజెక్టు వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థను బలపరచడంతో పాటు ఏపీలో ఎలక్ట్రానిక్స్, సిమెంట్, ఉక్కు పరిశ్రమల వృద్ధిని వేగవంతం చేస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ రైల్వే లైన్‌తో ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక మధ్య రైల్వే రవాణా వేగం కూడా పెరగనుంది
NDA coalition
Andhra Pradesh government
Tirupati to Katpadi Doubling Works
NDA కూటమి ప్రభుత్వం
వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు
Scroll for the next article