News10th Nov 04:49 PMSunil Byrisetty1 min read
అంతర్జాతీయ పోటీలకు విజయ్ ఎంపిక
కృష్ణాజిల్లా గన్నవరం మండలలోని చిన్న ఆవుటపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ క్రీడా శిక్షకులు, అంతర్జాతీయ క్రీడాకారుడు విజయ్ కుమార్ గోగులమూడి ప్రతిష్టాత్మక అడుగు వేశారు. మోడరన్ పెంటాతలన్
కృష్ణాజిల్లా గన్నవరం మండలలోని చిన్న ఆవుటపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ క్రీడా శిక్షకులు, అంతర్జాతీయ క్రీడాకారుడు విజయ్ కుమార్ గోగులమూడి ప్రతిష్టాత్మక అడుగు వేశారు. మోడరన్ పెంటాతలన్ క్రీడలో భాగం అయిన లేజర్ రన్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ మోడరన్ పెంటాతలన్ సంఘం ప్రధాన కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. ఈ సందర్బంగా విజయ్ ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) తన కార్యాలయంలో సన్మానించారు. అంతర్జాతీయ పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచ్చి రాష్ట్రానికి, దేశానికీ కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరారు. ఏలూరు జిల్లాలోని అల్లూరి సీతారామరాజు క్రీడా మైదానంలో జులై 10 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో విజయ్ ఉత్తమ ప్రతిభ కనపరిచి మహారాష్ట్రలోని నాశిక్ లో అక్టోబర్ 4వ తేదీ నుంచి 6వ జరిగిన జాతీయ పోటీలలో కూడా అసాధారణ ప్రతిభ కనబర్చారన్నారు. దుబాయ్ లో (యూఏఈ) రస్ అల్ ఖైమాహ్ లోని ఫ్లమింగో బీచ్ సమీపం నవంబర్ 11వ తేదీ 17తేదీ వరకు జరగబోయే ఆసియా అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు ఎంపికయ్యారని అన్నారు.