News13th Nov 03:42 PMSunil Byrisetty1 min read

ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,132 కోట్ల పెట్టుబడులు

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ CII Partnership Summit–2026లో ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తరలివచ్చాయి. రాష్ట్రంలో పోర్టులు, షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ల

ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,132 కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ CII Partnership Summit–2026లో ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తరలివచ్చాయి. రాష్ట్రంలో పోర్టులు, షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్, ఆయిల్ అండ్ గ్యాస్, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా మొత్తం రూ.8,132 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 8 కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. రాష్ట్ర ఆర్ అండ్ బీ, మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి రూ.8,132 కోట్ల పెట్టుబడులు రానుండగా, 4,377 మందికి ప్రత్యక్షంగా, 9,998 మందికి పరోక్షంగా కలిపి మొత్తం 14,375 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు 277.5 ఎకరాల భూమిని వినియోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు (APMB) పరిధిలో ఐదు కంపెనీలతో మొత్తం రూ.7,532 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 2,277 మందికి ప్రత్యక్షంగా, 4,898 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. మొత్తం 175 ఎకరాల భూమిలో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి.
Scroll for the next article