News13th Jul 03:01 PMSunil Byrisetty1 min read

ఏపీకి ఓడీ-ఓపీ అవార్డుల పంట

వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్(ఓడీ–ఓపీ) కింద ఆంధ్రప్రదేశ్ కు చెందిన తొమ్మిది ఉత్పత్తులకు అవార్డులు వచ్చినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత త

ఏపీకి ఓడీ-ఓపీ అవార్డుల పంట
వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్(ఓడీ–ఓపీ) కింద ఆంధ్రప్రదేశ్ కు చెందిన తొమ్మిది ఉత్పత్తులకు అవార్డులు వచ్చినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తొమ్మిది ప్రొడక్టుల్లో ఏడు ఉత్పత్తులు చేనేత, హస్త కళలకు చెందినవి కాగా, రెండు వ్యవసాయ రంగానికి సంబంధించినవని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో రాష్ట్రంలో చేనేత పరిశ్రమ, హస్త కళలు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నాయన్నారు. విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటికొప్పాక బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్ శారీ, బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి శారీ, నర్సాపూర్ అల్లికల కుట్టు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు చీరలు ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగం నుంచి గుంటూరు మిర్చి, శ్రీకాకుళం నుంచి జీడిపప్పు ఎంపికయ్యాయన్నారు.
Andhra Pradesh news
One District - One Product
nine products
Minister S. Savita
Guntur Mirchi
చీరాల సిల్క్ శారీ
తిరుపతి నుంచి వెంకటగిరి శారీ
నర్సాపూర్ అల్లికల కుట్టు
Scroll for the next article