Sports19th Aug 04:24 PMSunil Byrisetty1 min read

ఆంధ్రప్రదేశ్ అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికలు

ఆంధ్రప్రదేశ్ అందుల క్రికెట్ జట్టు కోసం ఆటగాళ్ల ఎంపికలు (సెలక్షన్స్) రేపటి నుంచి, అంటే ఆగస్టు 20 నుండి 22 వరకు, గుంటూరులోని పిచ్చుకల గుంట మైదానంలో జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని క్రికె

ఆంధ్రప్రదేశ్ అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికలు
ఆంధ్రప్రదేశ్ అందుల క్రికెట్ జట్టు కోసం ఆటగాళ్ల ఎంపికలు (సెలక్షన్స్) రేపటి నుంచి, అంటే ఆగస్టు 20 నుండి 22 వరకు, గుంటూరులోని పిచ్చుకల గుంట మైదానంలో జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (CABAP), VCEA, మరియు DCCAP సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గత జూలైలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 44 మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఈ ఎంపికల్లో పాల్గొంటారు. ఈ ఎంపికల నిర్వహణకు ఐటీసీ గుంటూరు మరియు ఎల్.వి.ఆర్. & సన్స్ క్లబ్ రీడింగ్ రూమ్ గుంటూరు స్పాన్సర్షిప్ చేస్తున్నాయని గుంటూరు జిల్లా బ్లైండ్ క్రికెట్ ఇంచార్జ్ కె. శ్రీనివాసరావు తెలిపారు. మరిన్ని వివరాల కోసం, దయచేసి 9705401300 నంబర్‌ను సంప్రదించగలరు.
Andhra Pradesh
Blind Cricket
CABAP
VCEA
DCCAP
Guntur
Sports
Cricket Selections
Disability Sports
ITC Guntur
LVR & Sons Club
CABAP Selections
Cricket Association for the Blind
Scroll for the next article