News14th May 12:35 PMSunil Byrisetty1 min read
బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాల పరిశీలన
గతేడాది విజయవాడ సమీపంలో బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గత వరద సమయంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి పనులు మొ
గతేడాది విజయవాడ సమీపంలో బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.
గత వరద సమయంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి పనులు మొదలుపెడతామని తెలిపారు.
సీజన్ ప్రారంభంలోగా 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.
బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు.
బుడమేరు వరద, ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలోకి కలిసేలా డీపీఆర్ తయారు చేస్తున్నారు.
బుడమేరు పాత ఛానెల్‌కు సమాంతరంగా 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరొక కొత్త ఛానెల్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల వెల్లడించారు.