News29th Jan 03:38 PMSunil Byrisetty1 min read
భారీ బడ్జెట్.. గతాన్ని మించి!
ఏపీ బడ్జెట్ ఈసారి భారీ స్థాయిలో ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉ
ఏపీ బడ్జెట్ ఈసారి భారీ స్థాయిలో ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తారు. ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. అదే రోజు వ్యవసాయ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ గత సంవత్సరం బడ్జెట్‌ను మించి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.3.5 లక్షల కోట్లు దాటే స్థాయికి చేరుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌లు అమలులోకి రావడం వల్ల బడ్జెట్ పరిమాణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా రూపొందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.