Politics11th Mar 03:59 PMSunil Byrisetty1 min read

సులభతర వాణిజ్యంలో ఏపీని ఉత్తమంగా నిలుపుతాం

సులభతర వాణిజ్యం, కంప్లెయన్స్ రిడక్షన్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. ఇటీవల కాలంలో

సులభతర వాణిజ్యంలో ఏపీని ఉత్తమంగా నిలుపుతాం
సులభతర వాణిజ్యం, కంప్లెయన్స్ రిడక్షన్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ శాఖల్లో పెద్దఎత్తున సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు వేగవతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. అంతేగాక సులభతర వాణిజ్యం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులకు అనువుగా లేని పలు చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి జరుగుతోందని వివరించారు. ఉత్తమ విధానాలను అవలంబించడం ద్వారా వేగవంతమైన వాణిజ్యానిక కృషి జరుగుతోందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.
Andhra Pradesh
వాణిజ్యం
Scroll for the next article