News13th Jul 03:12 PMSunil Byrisetty1 min read
7 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్
ఆగస్టు ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మగ్గాలున్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలున్న వారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించన
ఆగస్టు ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మగ్గాలున్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలున్న వారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించనుంది. అదే రోజు త్రిఫ్ట్ ఫండ్ నిధులు కూడా విడుదల చేయనున్నామన్నారు. గడిచిన ఎన్నికల ముందు చేనేతలకు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాటిచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయబోతున్నామన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం మరో హామీ నిలబెట్టుకున్నట్లే.