News10th Nov 03:20 PMSunil Byrisetty1 min read

30కి పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

30కి పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఐటీ, పరిశ్రమలు, రెవెన్యూ, హోంశాఖ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద

30కి పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
30కి పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఐటీ, పరిశ్రమలు, రెవెన్యూ, హోంశాఖ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం ప్రకటించింది. 2026–31 కాలానికి ఏపీ ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పాలసీ ప్రతిపాదనను ఆమోదించింది. 2036 వరకు రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ ప్రతిపాదనకు, సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0లో సవరణల ప్రతిపాదనకు ఆమోదం ప్రకటించింది. అలాగే రాంబిల్లిలో రూ.570.20 కోట్ల పెట్టుబడితో ఈప్యాక్ డేటా సెంటర్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. నాయుడుపేటలో లిథియం బ్యాటరీ మెటీరియల్ తయారీ పరిశ్రమపై చర్చించారు. కార్బన్ కాస్మో సంస్థ రూ.4 వేల కోట్లతో పరిశ్రమపై మంత్రివర్గంలో చర్చ జరిపారు. ఏపీ పోలీసు శాఖలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో కొత్త విభాగం ఏర్పాటు చేయనున్నారు.
Scroll for the next article