News9th Jan 11:56 AMSunil Byrisetty1 min read

మందుబాబులకు చేదు వార్త.. ధరల పెంపు?

కొన్ని రకాల మద్యం ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం (ఏఆర్‌ఈటీ)ను రద్దు చేస్తూ, పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

మందుబాబులకు చేదు వార్త.. ధరల పెంపు?
కొన్ని రకాల మద్యం ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం (ఏఆర్‌ఈటీ)ను రద్దు చేస్తూ, పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయం ప్రకారం సామాన్యులు ఎక్కువగా వినియోగించే రూ.99 ఎంఆర్‌పీ (180ఎంఎల్) క్వార్టర్ బాటిళ్లు, బీర్లు, వైన్, రెడీ టూ డ్రింక్స్ (ఆర్‌టీడీ) ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. వీటిని మినహాయించి, మిగతా అన్ని సైజుల మద్యం బాటిళ్ల ఎంఆర్‌పీపై రూ.10 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం షాపులు, బార్ల మధ్య దిగుమతి ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి, ఒకే ధరకు మద్యం అమ్మేలా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏఆర్‌ఈటీని రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.340 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా. అయితే, మద్యం ధరలను పెంచడం ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులన్నింటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.506 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh
Liquor Price Hike
AP Cabinet Decision
Excise Policy
Alcohol Prices
ARET Abolished
Beer Prices
బీర్ ధరలు
వైన్ ధరలు
రెడీ టు డ్రింక్స్
రాష్ట్ర ఆదాయం
Scroll for the next article