News3rd Sep 01:37 PMSunil Byrisetty1 min read

20కి పైగా అజెండా అంశాలతో కేబినెట్ భేటీ

సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 20కి పైగా అజెండా అంశాలతో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రైతులు, మత్స్యకారులు, సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలపై దృష్టి సారి

20కి పైగా అజెండా అంశాలతో కేబినెట్ భేటీ
సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 20కి పైగా అజెండా అంశాలతో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రైతులు, మత్స్యకారులు, సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలపై దృష్టి సారించింది. రైతులకు ఆర్థిక చేయూతపై కేబినెట్ లో కీలక ప్రతిపాదనలు వచ్చాయి. తోతాపురి మామిడికి మద్దతు ధర కోసం మార్క్ ఫెడ్ నిధుల అంశంపై చర్చిస్తున్నారు. రూ.281 కోట్ల నిధుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పొగాకు రైతులకు డీబీటీ ద్వారా రూ.94 కోట్ల ఆర్థికసాయం అందించే ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. రిజర్వాయర్ కేజ్ కల్చర్ పాలసీ -2026 ముసాయిదాకు ఆమోదం తెలపనుంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 78 వరద పునరుద్ధరణ పనులపై చర్చించి, రూ.6.24 కోట్ల పనులకు ఆమోదం తెలపనుంది. ఏపీ ట్రాన్స్ కో మధ్యకాలిక రుణానికి రూ.950 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ ప్రతిపాదన తదితర అనేక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది.
Andhra Pradesh Cabinet
AP Cabinet Meeting
Chandrababu Naidu
Amaravati
Farmers
Thotapuri Mango
MARKFED
Tobacco Farmers
DBT
Cage Culture Policy 2026
వరద పునరుద్ధరణ పనులు
ఏపీ ట్రాన్స్‌కో
విద్యుత్ రంగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఏపీ న్యూస్
అమరావతి వార్తలు
కేబినెట్ నిర్ణయాలు
Scroll for the next article