News2nd May 06:29 PMSunil Byrisetty1 min read

అమరావతి స్వప్నం సాకారం చేస్తున్న మోదీ

అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమరావతి పున:ప్రారంభానికి విచ్చేసిన మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి మాట్లాడారు. అమరావతిలో చా

అమరావతి స్వప్నం సాకారం చేస్తున్న మోదీ
అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమరావతి పున:ప్రారంభానికి విచ్చేసిన మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి మాట్లాడారు. అమరావతిలో చారిత్రక పరంపర, ప్రగతి రెండు కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్, బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం ఇదని పేర్కొన్నారు. అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు. ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
PM Modi in Amaravati
andhra pradesh capital
Chandrababu
DCM Pawan Kalyan
అమరావతి ఒక శక్తి
కొత్త ఆంధ్రప్రదేశ్
బౌద్ధ వారసత్వం
Scroll for the next article