News30th May 09:30 AMSunil Byrisetty1 min read
ఢిల్లీలో ఏపీ లెక్కే వేరు.. పరపతి పెరిగింది!
ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పరపతి గణనీయంగా పెరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు వేసిన ఓట్లతో ఢిల్లీలో రాష్ట్ర పరపతి పెరిగిందని తెలిపారు. అందుకే ఏపీకి
ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పరపతి గణనీయంగా పెరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు వేసిన ఓట్లతో ఢిల్లీలో రాష్ట్ర పరపతి పెరిగిందని తెలిపారు. అందుకే ఏపీకి ప్రాజెక్టులు, నిధులు వరదలా వస్తున్నాయని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని, రైల్వే జోన్ వచ్చిందని చెప్పారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో TCS, గూగుల్, ఆర్సెలార్ వంటి పరిశ్రమలు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని భూసమస్యలు అన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు.