News2nd Sep 09:34 AMSunil Byrisetty1 min read
ఎరువుల అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం
రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల అక్రమ విక్రయాలు జరగకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల విజిలెన్స్ బృందాలు దాడులు చేశాయి. గతవారం రోజులుగా నిర్వహించిన
రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల అక్రమ విక్రయాలు జరగకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల విజిలెన్స్ బృందాలు దాడులు చేశాయి. గతవారం రోజులుగా నిర్వహించిన సోదాల్లో పెద్దఎత్తున ఎరువుల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. అలాగే బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి కొందరు డీలర్లు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నట్టు దాడుల్లో వెళ్లడైంది. ఆగస్ట్ 23 నుంచి ఆగస్ట్ 31 వరకు మొత్తం 286 విజిలెన్స్ బృందాలు 598 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా అక్రమంగా విక్రయిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నుల ఎరువులు సీజ్ చేశారు. వారిపై 67 కేసులు నమోదు చేశారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4.30 కోట్ల 1,911 మె.ట. ఎరువుల అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేస్తూ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 124 కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన మరో 8 దుకాణ యజమానులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు.