News2nd Oct 12:07 PMSunil Byrisetty1 min read
ఏపీలో కరువు మండలాలు ఇవే!
ఖరీఫ్-2026 సీజన్‌లో ఏర్పడిన తీవ్ర వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. 21 జిల్లాల పరిధిలోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా గు
ఖరీఫ్-2026 సీజన్‌లో ఏర్పడిన తీవ్ర వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. 21 జిల్లాల పరిధిలోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించింది. వీటిలో 283 తీవ్ర, 105 మధ్యస్త కరువు మండలాలుగా వెల్లడించింది. రాయలసీమతో పాటు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరువు ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయనగరం, అనకాపల్లిలోనూ ప్రభావం ఎక్కువగా ఉంది. కరువు నిర్ధారణకు ప్రామాణికాలు, కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం ఖరీఫ్ కరువును అక్టోబరు 31 నాటికి ప్రకటించాల్సి ఉంది. అయితే జూన్ నుంచి ఆగస్టు వరకు 53.4 శాతం వర్షపాత లోటు నమోదు కావడం, ఎల్‌నినో పరిస్థితులతో కరువు మండలాలను ముందుగానే ప్రకటించాలని కరువు నిర్ధారణ కమిటీ ప్రతిపాదించింది.