Politics30th May 06:19 PMSunil Byrisetty1 min read
పవన్ ఎన్నికల సర్వే.. పోటీకి ఇప్పటి నుంచే?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమితోనే కలసి పోటీ చేస్తామని గతంలో పవన్ ప్రకట
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమితోనే కలసి పోటీ చేస్తామని గతంలో పవన్ ప్రకటించిన నేపథ్యంలోనే ఇలా జరుగుతోందా అని చర్చించుకుంటున్నారు. అందుకే ముందుగా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో నమ్మకమైన నేతలను, సుదీర్ఘకాలం నుంచి పార్టీతో నడుస్తున్న వారికి మాత్రమే ఇన్ ఛార్జి పదవులను అప్పగిస్తున్నారట. తప్ప 175 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులను నియమించి, కూటమి పార్టీల మధ్య విభేదాలకు కారణం కావొద్దని అనుకుంటున్నారు. అందుకే ఇప్పటి వరకూ చాలా నియోజకవర్గాల్లోనూ ఇన్ ఛార్జులు లేరు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగితే తాను తీసుకోవాల్సిన స్థానాలపై కూడా అంచనా రావడానికి ఒక సర్వే చేయించాలని కూడా పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారని తెలిసింది. పేరున్న సంస్థతో సర్వే చేయించి జనసేనకు బలం ఉన్న నియోజకవర్గాల గురించి తెలుసుకోవాలని భావిస్తున్నారని సమాచారం.