News20th Apr 11:48 AMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్, రాష్ట్ర మంత్రులు, నేత
ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్, రాష్ట్ర మంత్రులు, నేతలు శుభాకాంక్షలతో ముంచెత్తారు.
రాష్ట్రవ్యాప్తంగా జన్మదిన వేడుకలతోపాటు అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
‘‘ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై.. శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం.. చంద్రబాబు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం – నాలుగో పర్యాయం సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు విజన్, పనిలో చూపే ఉత్సాహం అద్భుతం – భవిష్యత్తును ముందుగానే అంచనా వేయడం, వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం – వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన సీఎం చంద్రబాబుకు సంపూర్ణ ఆయుషు, ఆనందాన్ని ప్రసాదించాల’’ని దేవుడిని ప్రార్థిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.