News21st May 12:30 PMSunil Byrisetty1 min read
జనం కోస పవన్ ‘మన ఊరు - మాటా మంతి'
ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖీ నిర్వహించనున్నారు. దీనికి ‘మన ఊరు - మాటా మంతి' అని పేరు పెట్టారు. ఈ నెల
ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖీ నిర్వహించనున్నారు.
దీనికి ‘మన ఊరు - మాటా మంతి' అని పేరు పెట్టారు.
ఈ నెల 22న ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ వేదిక కానుంది.
ఇందుకోసం టెక్కలి ప్రజలను గురువారం ఉదయం 9 గంటలకు థియేటర్‌కి తీసుకెళ్లనున్నారు.
మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారితో మాట్లాడతారు.
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశలవారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు