News4th Jun 12:00 PMSunil Byrisetty1 min read
జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా యువగళం
రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాల
రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్‌తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేష్ ను ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా యువనేత లోకేష్.. పవన్ కళ్యాణ్‌తో పంచుకున్నారు.