News13th Jun 11:17 AMSunil Byrisetty1 min read
లవ్ బ్రేకప్.. తాగి చిందేసిన విద్యార్థిని
ఈ మధ్య లవ్ బ్రేకప్‌లు పెరిగిపోతున్నాయి. బ్రేకప్ అయిన వాళ్లు వేస్తు్న్న వేషాలు కూడా మామూలుగా ఉండటం లేదు. తాజాగా ఏపీలో ఓ విద్యార్థిని లవ్ బ్రేకప్ కావడంతో మందేసి చిందేసింది. పంట పొలా
ఈ మధ్య లవ్ బ్రేకప్‌లు పెరిగిపోతున్నాయి. బ్రేకప్ అయిన వాళ్లు వేస్తు్న్న వేషాలు కూడా మామూలుగా ఉండటం లేదు. తాజాగా ఏపీలో ఓ విద్యార్థిని లవ్ బ్రేకప్ కావడంతో మందేసి చిందేసింది. పంట పొలాల్లో మద్యం తాగిన విద్యార్థిని డ్యాన్స్ చేసింది. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన ఒక యువతి లవ్ బ్రేకప్ కావడంతో యువకునితో కలిసి మద్యం తాగింది. మత్తులో కూరుకుపోయింది. ఆమెను ఇంటికి తీసుకువెళ్లడం వారి వల్ల కాలేదు. అదిచూసిన మరో వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. మత్తులోనే ఉన్న ఆమె స్టేషన్‌లో సిబ్బందిపైనా వీరంగం సృష్టించింది. చివరకు తల్లిదండ్రులను పిలిచి ఆమెను అప్పగించారు.