News4th Jan 01:37 PMSunil Byrisetty1 min read
పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ
దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సీ.ఎం.ఐ.ఈ డేటా ఆధారంగా విడుదల చేసిన నివేదికలో దేశవ్యాప్తంగా గత తొమ
దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సీ.ఎం.ఐ.ఈ డేటా ఆధారంగా విడుదల చేసిన నివేదికలో దేశవ్యాప్తంగా గత తొమ్మిది నెలల్లో వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బలమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. మాటిచ్చిన విధంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ ఉద్యోగాల కల్పనలో, పెట్టుబడులు రాబట్టడంలో మరింత వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.