News28th Jan 12:42 PMSunil Byrisetty1 min read

ఏపీలో విమానాల తయారీ కేంద్రం!

బ్రెజిల్‌కు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ‘ఎంబ్రేయర్’, భారతీయ దిగ్గజం ‘అదానీ ఏరోస్పేస్’ సంయుక్తంగా చేపట్టనున్న భారీ విమాన తయారీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు ప్రభుత్వం

ఏపీలో విమానాల తయారీ కేంద్రం!
బ్రెజిల్‌కు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ‘ఎంబ్రేయర్’, భారతీయ దిగ్గజం ‘అదానీ ఏరోస్పేస్’ సంయుక్తంగా చేపట్టనున్న భారీ విమాన తయారీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకునేందుకు గుజరాత్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. భారతదేశంలో చిన్న, మధ్య తరహా ప్యాసింజర్ విమానాలను తయారు చేసేందుకు అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రేయర్ సంస్థతో చేతులు కలిపింది. ఈ జాయింట్ వెంచర్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తుండగా, ఏపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాను తెరపైకి తెచ్చింది. విమాన తయారీకి అవసరమైన ఎకోసిస్టమ్ బెంగళూరులో బలంగా ఉంది. అనంతపురం జిల్లా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి (దేవనహళ్లి) అత్యంత సమీపంలో ఉండటం ఏపీకి కలిసొచ్చే ప్రధాన అంశం.
Andhra Pradesh
AP Government
Aircraft Manufacturing
Aviation Industry
Embraer
Adani Aerospace
Adani Defence
విమానాశ్రయం
పరిశ్రమల అభివృద్ధి
పెట్టుబడులు
గుజరాత్ పోటీ
Scroll for the next article