News8th Sep 04:48 PMSunil Byrisetty1 min read

ఏపీలో ఆదాయం కన్నా అత్యధిక ఖర్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితి క్లిష్టంగాఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రాబడి లోటు ఏకంగా 36

ఏపీలో ఆదాయం కన్నా అత్యధిక ఖర్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితి క్లిష్టంగాఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రాబడి లోటు ఏకంగా 36,942 కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది మొత్తానికి బడ్జెట్‌లో అంచనా వేసిన 22,003 కోట్ల కంటే ఎక్కువ. అదే సమయంలో ద్రవ్య లోటు 49,134 కోట్లకు చేరింది. ఇది వార్షిక అంచనాలో 64 శాతం. నికర రుణాలు కూడా సరిగ్గా అంతే మొత్తంలో ఉండటం రాష్ట్ర రుణ భారాన్ని స్పష్టం చేస్తోంది. ఈ గణాంకాలను ఆర్థిక వ్యవస్థ కోణంలో చూస్తే రాబడి లోటు 168% పెరగడం అంటే రాష్ట్రానికి వచ్చే రోజూవారీ ఆదాయం కన్నా నిత్యం చేసే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అర్థం. పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా వచ్చే స్వీయ ఆదాయం సరిపోకపోవడంతో ప్రభుత్వ నిర్వహణకే పెద్ద ఎత్తున నిధులు కొరవడుతున్నాయి. ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ అత్యధిక రుణాలు , అత్యధిక రాబడి లోటుతో మొదటి వరుసలో నిలుస్తోంది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడులకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే ఈ పరిణామానికి దారితీసింది.
Andhra Pradesh Economy
AP Revenue Deficit
AP Fiscal Deficit
CAG Report
Andhra Pradesh Budget
AP Government
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
ఏపీ అప్పులు
రాబడి వ్యయం
ద్రవ్య లోటు
అమరావతి
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article