Education12th Mar 10:33 AMSunil Byrisetty1 min read

విడతలవారీగా బకాయిలు.. ఒత్తిడి చేస్తే చర్యలే: మంత్రి లోకేష్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కొన్ని కళాశాలలు విద్యార్థుల పై ఒత్తిడి చేస్తున్నట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.78

విడతలవారీగా బకాయిలు.. ఒత్తిడి చేస్తే చర్యలే: మంత్రి లోకేష్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కొన్ని కళాశాలలు విద్యార్థుల పై ఒత్తిడి చేస్తున్నట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.788 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాం. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో నేను జరిపిన చర్చల్లో భాగంగా వైసిపి ప్రభుత్వం పెట్టిన రూ.4271 కోట్లు బకాయిలు కూడా విడతల వారీగా చెల్లిస్తామని చెప్పాను. నా ప్రతిపాదనకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అంగీకరించాయి. గత ప్రభుత్వ విధానాన్ని మార్చి ఇప్పుడు ఫీజులు నేరుగా కళాశాలలకే చెల్లిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన ఫీజు బకాయిలు అతి త్వరలోనే చెల్లిస్తాం. ఒక వేళ ఏదైనా కళాశాల యాజమాన్యం విద్యార్థుల పై ఒత్తిడి చేస్తే తల్లిదండ్రులు నేరుగా నా దృష్టికి తీసుకురండి. ఒత్తిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. తల్లితండ్రులు, విద్యార్థుల పై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్య’మని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Nara lokesh
Fee Reimbursement
Andhra Pradesh
Education
ఫీజు రీయింబర్స్మెంట్
కళాశాలలు
Scroll for the next article