News30th Mar 02:09 PMSunil Byrisetty1 min read
పండుగ రోజూ ఆర్థిక మంత్రి సమీక్ష
ఉగాది పండుగ రోజు కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశంతో బిల్లుల చెల్లింపులపై అధికారులతో కసరత్తు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న చిన్
ఉగాది పండుగ రోజు కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఎం చంద్రబాబు ఆదేశంతో బిల్లుల చెల్లింపులపై అధికారులతో కసరత్తు చేశారు.
ఇబ్బందుల్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే దిశగా చర్చించారు.
అందుబాటులో ఉన్న నిధులెన్ని.. ఏ మేరకు బిల్లులు చెల్లింపులు జరపగలమన్న అంశంపై సమాలోచనలు జరిపారు.
అవకాశం ఉన్న మేరకు ఇవాళే బిల్లుల చెల్లింపులు జరిపేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. రూ. 2 వేల కోట్ల వరకు బిల్లులు చెల్లింపులు జరిపే అవకాశాలు ఉన్నాయి.